ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:26 PM
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జడ్చర్ల పట్టణంలో, మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
- శ్రీకృష్ణ భగవానుడి ఉత్సవ మూర్తిని అంగరంగవైభవంగా ఊరేగింపు
జడ్చర్ల, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జడ్చర్ల పట్టణంలో, మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి 12గంటల సమయంలో శ్రీకృష్ణ భగవానుడి జననం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వాసవీకన్యకపరమేశ్వరీ ఆలయంలో బాలకృష్ణ భక్త సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు నిజాభిషేకం, సామూహికంగా శ్రీకృష్ణ సహస్రనామార్చన నిర్వహించారు. రాత్రి సంగీత కచేరి నిర్వహించారు. విద్యానగర్ కాలనీలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో చిన్నారులకు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి సంస్కార భారతి సభ్యుడు రాధాకృష్ణ బహుమతులు అందచేశారు. మండలంలోని పోలేపల్లిలో త్రైత సిద్దాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి ఉత్సవమూర్తిని ఊరేగించారు. పరషవేదీశ్వరస్వామి ఆలయంలో జడ్చర్ల ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పఠనంను నిర్వహించారు. జడ్చర్ల పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జననం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.