Share News

ఘనంగా గుడ్‌ ఫ్రైడే

ABN , Publish Date - Apr 18 , 2025 | 11:19 PM

పట్టణంలోని పలు చర్చీల్లో శుక్రవారం గుడ్‌ ఫ్రైడే వేడుకలు క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా గుడ్‌ ఫ్రైడే
జడ్చర్ల పట్టణంలో ప్రార్థనలో పాల్గొన్న క్రైస్తవులు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని పలు చర్చీల్లో శుక్రవారం గుడ్‌ ఫ్రైడే వేడుకలు క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. కల్వరి ఎంబీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేవుడు పలికిన 7 వాక్యాలను సంఘంలోని ఏడు మంది సభ్యులు వివరించారు. గుడ్‌ ఫ్రైడే వేడుకల కోసం 40 రోజులుగా క్రైస్తవ సోదరులు ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. ఎంబీ చర్చి పాస్టర్‌ రెవరెండ్‌ వరప్రాసాద్‌, వైస్‌ చైర్మన్‌ జాకబ్‌, కల్వరి ఎంబీ చర్చి కార్యదర్శి జేఏ డేవిడ్‌, సహయ కార్యదర్శి స్టీవెన్‌, ట్రెజరర్‌ ఇమ్యాన్యూల్‌ రాజు, ప్రచార కార్యదర్శి టైటస్‌ రాజేందర్‌ పాల్గొన్నారు.

జడ్చర్ల : యేసు ప్రభువుకు శిలువ వేసిన రోజనే గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటామని జడ్చర్ల బేతని ఎంబీ చర్చి పాస్టర్‌ విలియమ్‌బెత్‌ అన్నారు. జడ్చర్ల పట్టణంలోని ఎంబీ చర్చిలో శుక్రవారం క్రిస్టియన్‌లు ఘనంగా గుడ్‌ ఫ్రైడే కార్యక్రమాన్ని జరుపుకున్నారు. యేసు ప్రభువుకు శిలువ వేసిన రోజున యేసు ప్రభువు చెప్పిన ఏడు మాటలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ చర్చిల్లో ఆరాధన కార్యక్రమాలను నర్విహించారు. యేసు ప్రభువును స్మరిస్తూ ప్రార్థనగీతాలు, పాటలు పాడారు. మధ్యాహ్నం వరకు ఉపవాస దీక్షలు నిర్వహించారు. సంఘకాపరి విలియంబెత్‌, ఫిలెమోన్‌, తిమోతి, విద్యాసాగర్‌, ప్రీతమ్‌, మైఖేల్‌మనోహర్‌, ఎబినేజర్‌, జయపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 11:19 PM