చేనేత కార్మికులను కళాకారులుగా గుర్తించాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:28 PM
చేనేత కార్మికులను కళాకారులుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని తెలంగా ణ జాగృతి అధఽ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అ న్నారు.
డీకే అరుణ పార్లమెంటులో చర్చించాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
గద్వాల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): చేనేత రంగం రోజురోజుకూ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది. పనిచేస్తున్న కార్మికులు బతుదెరువు కోసం ఇతర మార్గాలను వెతుకుంటున్నారు, వా రిని కళాకారులుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని, ప్రతీ విషయంపై గట్టిగా ప్రశ్నించే డీకే అరుణ ఈ విషయంపై పార్లమెంటులో గళమెత్తాలని తెలంగా ణ జాగృతి అధఽ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అ న్నారు. ఆదివారం గద్వాలలో చేనేత కార్మికుల సమస్యలపై వారితో మాట్లాడారు. చేనేత మ గ్గంపై కూర్చొని మగ్గం నేశారు. ఈ సందర్బంగా నేసే సమయంలో వారు ఎంత కష్టపడుతారో తెలుసుకున్నారు. అనంతరం కార్మికులతో మా ట్లాడుతూ గద్వాలలో 500కు పైగా ఉన్న చేనేత మగ్గాలు 350కు పడిపోయాయని అంటున్నారు. గద్వాలలో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో 50ఎకరాల్లో హ్యాండ్లూమ్ పార్క్‌ను ఇచ్చారు. కానీ అభి వృద్ధి చేయలేదన్నారు. అందులో 20ఎకరాల్లో చే నేత కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతానని హామీ ఇచ్చారు. పోస్టాఫీసు దగ్గర ఉన్న దౌలత్ టీ స్టాల్‌లో టీ తాగడానికి వచ్చిన ఉపాధ్యాయులు, రైతులు, వ్యాపారులు, మహిళలతో ముచ్చటించారు. టీస్టాల్ యజమాని దౌలత్ కవితను ఘనంగా సత్కరించారు.