Share News

రసవత్తరంగా హ్యాండ్‌బాల్‌ పోటీలు

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:26 PM

జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరే షన్‌ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌, హీరా మోడల్‌ స్కూల్‌ మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌-19 హ్యాం డ్‌బాల్‌ పోటీలు రసవత్తరంగా కొనసాగాయి.

రసవత్తరంగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
మహబూబ్‌నగర్‌-కరీంనగర్‌ జట్లతో టోర్నీ పరిశీలకులు శ్రీనివాస్‌, పుల్లయ్య

- ఫైనల్‌కు చేరిన మహబూబ్‌నగర్‌, వరంగల్‌

- నేడు ఫైనల్‌

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరే షన్‌ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌, హీరా మోడల్‌ స్కూల్‌ మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌-19 హ్యాం డ్‌బాల్‌ పోటీలు రసవత్తరంగా కొనసాగాయి. శనివారం మొదటి సెమీఫైనల్‌లో బాలుర విభాగంలో మహబూబ్‌నగర్‌ జట్టు 13-6 గో ల్స్‌ తేడాతో కరీంనగర్‌పై, రెండో సెమీ ఫైౖన ల్‌లో వరంగల్‌ జట్టు 14-6తో తేడాతో ఖ మ్మంపై గెలిచింది. బాలికల విభాగంలో జరిగిన మొదటి సెమీఫైనల్‌లో మహబూబ్‌ నగర్‌ జట్టు 5-2తో కరీంనగర్‌పై, రెండో సె మీఫైనల్‌ వరంగల్‌ జట్టు 16-6తో ఖమ్మంఫై గెలిచింది. బాల, బాలికల విభాగంలో మహ బూబ్‌నగర్‌, వరంగల్‌ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌లో ఇరు జట్లు తలబడనున్నాయి.

క్రీడాకారులకు క్రమశిక్షణ తప్పనిసరి

క్రీడాకారులకు క్రమశిక్షణ తప్పనిసరి అని టోర్నీ రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్‌, పుల్లయ్య అన్నారు. రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. వారు మాట్లాడుతూ హ్యాండ్‌బాల్‌కు ప్రపం చంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ శారదాబాయి, టోర్నీ ఆర్గ నైజర్‌ జియావుద్దీన్‌, పీడీ వేణుగోపాల్‌, హ్యాండ్‌బాల్‌ ప్రతినిధులు రజనీకాంత్‌రెడ్డి, అ నిల్‌కుమార్‌, మజిబ్‌ ఉల్‌ రహెమాన్‌, అహ్మ ద్‌హుస్సేన్‌, ప్రదీప్‌, బాల్‌రాజ్‌, సర్ఫరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 11:26 PM