భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:17 PM
జిల్లా వ్యాప్తంగా గురువారం గురు పౌర్ణమి వే డుకలను ఘనంగా నిర్వహించారు.
నారాయణపేట, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురువారం గురు పౌర్ణమి వే డుకలను ఘనంగా నిర్వహించారు. పట్టనంలోని శక్తిపీఠం, షిర్డీసాయి, అమృతసాయి, సత్యసాయి, అవధూత నర్సింహస్వామి, రాఘవేంద్ర స్వామి ఆలయం, వ్యాసాశ్రమం, సూర్యనంది క్షేత్రం మాతా మాణికేశ్వరి, హస్నాబాద్ వద్ద గల మా ణిక్ ప్రభు సంస్థానం, కుర్వాపురం శ్రీపాద వల్లభుడైన దత్తాత్రేయ స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూ జలు, అన్నదానాలు కొనసాగాయి. షిర్డీసాయి హనుమాన్ ఆలయం, అమృతసాయి మంది ర్‌లలో ఉదయం కాకడ హారతితో ప్రారంభమై ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే చిట్టేం పర్ణికా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకు మార్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి సాయిహ నుమాన్‌మందిర్‌లో షిరిడి సాయిబాబను దర్శించుకున్నారు. శక్తి పీఠంలో స్వామి శాంతా నంద ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహిం చారు. యానగుంది సూర్యనందిక్షేత్రంలో మాతా మాణికేశ్వరి జయంతి ఉత్సవాలు జరిగాయి.
ధన్వాడ: ధన్వాడలో గురుపౌర్ణమి వేడుకల ను నిర్వహించారు. రాఘవేంద్ర కాలనీ సాయి బాబ మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించు కున్నారు.
మక్తల్‌రూరల్: మండలంలోని వల్లభాపురం దత్తపీఠంలో అంకురార్పణ చేశారు. పీఠంలో ప్ర త్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసా దాలు అందజేశారు. ఈ నెల 20వ తేదీ వరకు గురు పౌర్ణమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
నారాయణపేట న్యూటౌన్: మండలంలోని జిలాల్‌పూర్‌లో బీజేపీ నాయకులు గురుపౌర్ణమి సందర్భంగా లింగప్పతాతను సత్కరించారు.
కృష్ణ: గురువు లేని విద్య గుడ్డి విద్య అని క్షీర లింగేశ్వర మహాస్వాములు అన్నారు. గురు పౌర్ణ మి పురస్కరించుకుని మండలంలోని చేగుంట గ్రామంలో వెలసిన పార్వతి పరమేశ్వర ఆలయ కల్యా మండపంలో గురువందన కార్యక్రమంలో భాగంగా గురువులకు, మహాస్వాములకు సన్మా నం నిర్వహించారు.