Share News

గన్నీబ్యాగుల సమస్య లేకుండా చూడాలి

ABN , Publish Date - May 20 , 2025 | 11:26 PM

కేంద్రాలలో సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ నరసింగరావు సూచించారు.

గన్నీబ్యాగుల సమస్య లేకుండా చూడాలి
గార్లపాడు కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

- ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

ధరూర్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, కేంద్రాలలో సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ నరసింగరావు సూచించారు. మంగళవారం మండలంలోని భీంపురం, రేవులప ల్లి, గార్లపాడు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులకు కల్పిస్తున్న సదుపాయాలు, సెంటర్‌ నిర్వహణ తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుక్స్‌ వెరిఫికే షన్‌, ట్యాబ్‌ ఎంట్రీ గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎం శోభారా ణి, సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 11:26 PM