Share News

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:14 PM

‘ఆర్థిక భారం... మొదలుకాని ఇంటినిర్మాణం’ పేరిట ఈనెల 20న ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి గ్రామస్థులు స్పందించారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ
అంజమ్మ ఇంటినిర్మాణానికి భూమిపూజ చేస్తున్న సర్పంచ్‌ కేశమళ్ల అనూష

- పెద్దాపూర్‌లో ముందుకువచ్చిన ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు

వెల్దండ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘ఆర్థిక భారం... మొదలుకాని ఇంటినిర్మాణం’ పేరిట ఈనెల 20న ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి గ్రామస్థులు స్పందించారు. మండలంలోని పెద్దాపూర్‌ గ్రామంలో మొదటి విడతలో గోరటి అంజమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యింది. ఆరు నెలలు గడిచినా ఆర్థిక ఇబ్బందులతో అంజమ్మ ఇల్లు మొదలుపెట్టలేదు. దీంతో ఆర్థిక భారం పేరుతో ‘ఆంధ్రజ్యోతి’ రాసిన కథనానికి స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, స్నేహితులు స్పందించారు. ఈ క్రమంలో బుధవారం స్థానిక సర్పంచ్‌ కేశమళ్ల అనూష గ్రామస్థులతో కలిసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇంటి నిర్మాణానికి అనూష తనవంతుగా సిమెంటును ఇస్తానని తెలిపారు. అదేవిదంగా మరికొందరు నిర్మాణానికి అవసరమైన సామగ్రి అందించి నిర్మాణం జరిగేలా చూస్తామని అంజమ్మకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ చెన్నోజుప్రసాద్‌, గ్రామకార్యదర్శి సైదమ్మ, కల్వకుర్తి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కేశమళ్ల కృష్ణ, మాజీ ఎంపీటీసీ చక్రవర్తిగౌడ్‌, వార్డుసభ్యులు రమేష్‌, శ్రీధర్‌, తిరుపతి, నిరంజన్‌, మమత, రజిని, అంజయ్య, మల్లేష్‌, లలితమ్మ, నాయకులు లక్ష్మారెడ్డి, శ్రీను, అనిల్‌కుమార్‌, అంజనేయులు తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 11:14 PM