Share News

ఘనంగా ఆయుధ పూజ

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:33 PM

విజయదశమిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేం ద్రంలోని సాయుధ దళ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పూజలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హాజరై ఆయుధాల కు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా ఆయుధ పూజ
ఆయుధ పూజ నిర్వహిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు

  • జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విజయదశమిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేం ద్రంలోని సాయుధ దళ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పూజలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హాజరై ఆయుధాల కు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.... పోలీస్‌శాఖలో ప్రతి సంవత్సరం దసరా పండుగ ముందు ఆయుధ పూజ నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పం డుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీస్‌ విభాగం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ సిబ్బందికి, ప్రజలకు ముందస్తుగా దస రా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అ దనపు ఎస్పీ కె.శంకర్‌, డీఎస్పీ మొగులయ్య, సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు, ఆర్‌ఐలు వెం కటేష్‌, హారీఫ్‌, గద్వాల సీఐ శ్రీను, సీసీఎస్‌ సీఐ నాగేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:33 PM