అంగరంగ వైభవం
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:32 PM
నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం లోని రామాపురంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వర కల్యాణం
- వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
- రామాపురంలో పండుగ వాతావరణం
పెంట్లవెల్లి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం లోని రామాపురంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుడు శివ కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రాతఃకాల పూజలు, అభిషేకం, దీక్ష, శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం 11:30 గంటలకు వేలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ అలివేలుమంగ సమేత లక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయాభివృద్ధి సలహాదారులు జూపల్లి రవీందర్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు పగిడాల శ్రీనివా సులు, ఆలయ కమిటీ చైర్మన్ నల్లవెల్లి చంద్రయ్య, కొమ్మరాజు, కొమ్మ గోపాల్, గడ్డం శేఖర్‌యాదవ్, కలమూరి నిరంజన్, ఉడత నాగరాజు, కలమూరి మధు తదిత రులు పాల్గొన్నారు.