Share News

ధాన్యాన్ని వెంటనే కొనాలి : మాజీ మంత్రి

ABN , Publish Date - May 02 , 2025 | 11:24 PM

రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే ఆసల్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేయడం తగదని, వెంటనే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

ధాన్యాన్ని వెంటనే కొనాలి : మాజీ మంత్రి
దాన్యాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హన్వాడ, మే 2 (ఆంధ్రజ్యోతి) : రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే ఆసల్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేయడం తగదని, వెంటనే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం హన్వాడలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. రైతుబంధు, రుణమాఫీ, బోనస్‌ అందించడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రైతుబంధు, రైతు భీమా సమయానికి అందించి ఆదుకున్నామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తి అయ్యావని, క్వాల ద్వారా నీటిని అందించే పని ఉందని వెంటనే టెండర్లు పిలవాలని డిమాండ్‌ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్‌, మాజీ అధ్యక్షుడు కొండ లక్ష్మయ్య, సొసైటీ చైర్మన్‌ వెంకటయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు నరేందర్‌, నాయకుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 11:24 PM