Share News

ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలి

ABN , Publish Date - May 14 , 2025 | 10:57 PM

ధాన్యం కొను గోలు చేసిన వెంటనే కేంద్రాల్లో నిల్వ చేయకుం డా సంబంధిత మిల్లర్లకు వెంటనే తరలించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలి
ధరూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

ధరూరు, అల్వాలపాడులో ధాన్యం కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

ధరూరు, మే 14(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొను గోలు చేసిన వెంటనే కేంద్రాల్లో నిల్వ చేయకుం డా సంబంధిత మిల్లర్లకు వెంటనే తరలించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ధరూర్‌ మండంలోని ధరూర్‌, అల్వాలపాడులో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ నర్సింగరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ధాన్యం కొనుగోలు కేం ద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలిం చారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో ధా న్యం సేకరించారు, మిల్లులకు ఎంత ధాన్యం త రలించారని తదితర వివరాలను నిర్వాహకుల ను అడిగి తెలుసుకున్నారు.కొనుగోలు కేంద్రానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. స్వ యంగా డిజిట్‌ తేమ మీటర్‌ ద్వారా ధాన్యం తే మ శాతాన్ని పరీక్షించి, కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం 17శాతం రాగానే కాంటా వేసి మ ద్దతు ధరకు కొనుగోలు చేసి మిల్లులకు తరలిం చాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సివిల్‌ సప్లయ్‌ డీఎంను ఆదేశించారు. ధాన్యం రవాణా పనులు ఏమా త్రం ఆలస్యం కాకుండా ఉండేందుకు అవసర మైన హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూ చించారు. ధాన్యం రవాణా కోసం లారీలను త గిన సంఖ్యలో సిద్ధంగా ఉంచాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వెంటనే ట్యా బ్‌లో నమోదు చేసి, రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసు కోవాలని ఏపీఎంలకు కలెక్టర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అ న్ని వివరాలు రిజిస్టర్‌లో పక్కాగా నమోదు చే యాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని, రైతులకు ఎ లాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జి ల్లా పౌరసరఫరాల అధికారి స్వామికుమార్‌, సివి ల్‌ సప్లయ్‌ డీఎం విమల, ధరూర్‌ తహసీల్దార్‌ భూపాల్‌ రెడ్డి, అధికారులు, రైతులు ఉన్నారు.

Updated Date - May 14 , 2025 | 10:57 PM