నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:20 PM
ఈ ఏడాది వర్షాకాలంలో అధిక వర్షాలతో సాగుచేసిన పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.
- గన్నీ బ్యాగులు లేక అన్నదాతల అవస్థలు
- క్వింటాలుకు 6 కిలోల తరుగు తీస్తున్నారని ఆరోపణ
అయిజ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వర్షాకాలంలో అధిక వర్షాలతో సాగుచేసిన పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. అధిక వర్షాలతో ఒక్క మొక్కజొన్న పంట తప్ప అన్ని పంటలు దెబ్బతిన్నాయి. వరిపైరుకు సకాలంలో యూరియా అందక కూడా దిగుబడి తగ్గింది. ఎకరాకు దాదా పు 30 క్వింటాళ్ల ధాన్యం వచ్చేది. ఈ ఏడాది 22 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చింది. ఇదిలా ఉండ గా కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో మోసం చేస్తున్నారని పలు వురు రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సకాలంలో గన్నీ బ్యాగులు అందించడం లేదని, తూకం చేసిన ధాన్యం కూడా ఎత్తడం లేదని పలువురు రైతులు ఆరో పిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 75 కొనుగోలు కేంద్రాలు
జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా జూరాల, ఆర్డీఎస్, బోరుబావులు, చెరువులు, కుంటల కింద వానాకాలంలో మొ త్తం 38,743 హెక్టార్లలో వరి సాగు చేశారు. 2,59,776 మెట్రి క్ టన్నులు సన్న రకం, 3.120 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 75 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేక రిస్తున్నారు. కానీ సకాలంలో సంచులు అందించకపోవడం తో ఇబ్బంది పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. ఆర్డీ ఎస్ పరిధిలో బైనపల్లి, రాజాపూర్, పులికల్ తదితర గ్రామాల్లో సంచులు లేక సోమవారం కొనుగోళ్లు జరగలేదు.
తూకాల్లో మోసం..
ప్రతీ 40 కిలోల సంచిలో దాదాపు 2,3 కిలోలు అధికంగా తూకం చేస్తున్నారు. సంచి తూకం కిలో తీసినా ఇంకా రెండు కిలోల లెక్క ఏంటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. క్విం టాలు ధాన్యం తూకం రావాలంటే 6 నుంచి 8 కిలోల వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొను గోలు కేంద్రాల్లో ధాన్యం ఎత్తేటప్పుడు.. మిల్లు వద్ద దించే స మయంలో హమాలీ భారం రైతులపై వేస్తున్నారని అన్నదా తలు వాపోతున్నారు. ఉన్నత స్థాయి అధికారుల ఆకస్మిక తనఖీలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
తూకాలలో మోసం జరిగితే చర్యలు
రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ ఇబ్బందులు రా కుండా చూసుకుంటాం. నిర్దేశించిన మేరకు కొనుగోళ్లు జరగా లి. తూకాలలో మోసాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం.
- స్వామికుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి