ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలి
ABN , Publish Date - May 13 , 2025 | 11:25 PM
అకాల వర్షా లు ప్రారంభం కాకముందే ధాన్యం మిల్లులకు చేరాలని కొనుగోళ్లను వేగవంతం చేసి రైస్‌మి ల్లులకు పంపించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు.
- కొత్తపల్లి, రేకులపల్లిలో పర్యటించిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
గద్వాల, మే 13(ఆంధ్రజ్యోతి): అకాల వర్షా లు ప్రారంభం కాకముందే ధాన్యం మిల్లులకు చేరాలని కొనుగోళ్లను వేగవంతం చేసి రైస్‌మి ల్లులకు పంపించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. మంగళవారం మండలంలో ని కొత్తపల్లి, రేకులపల్లి గ్రామాల్లో ధాన్యం కేం ద్రాలను ఆయన పరిశీలించారు. ఈ రెండు కేం ద్రాల్లో మార్కెట్ నుంచి తెచ్చిన ధాన్యం విక్రయానికి వచ్చాయి. వాటిలో 663 సంచుల ధా న్యం ఇప్పటికే రైస్ మిల్లులకు తరలిపోగా రెం డు లాట్‌లు ఉన్నాయి. వాటిపై అదనపు కలెక్టర్ ఆరా తీశారు. అయితే రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో అధికారులే మరోసారి పరిశీలించాలని సూచించినట్లు తెలుస్తున్నది. మిగిలిన ధాన్యాన్ని పరిశీలించారు. ఇప్పటి వర కు కొనుగోలు చేసిన రికార్డులను తనిఖీ చేశా రు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోళ్లను వేగవంతం చేయాలని చెప్పారు. గన్నీ బ్యాగులు, లారీల కొరతపై ఆరా తీశారు. రైస్ మిల్లులలో ధాన్యాన్ని వెంటనే అన్‌లోడింగ్ చేసి లారీలను పంపించాలని సూచించారు. ఈ నెల చివరినాటికి ధాన్యం పూర్తిగా మిల్లులోకి చేరిపోవాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ మల్లికార్జున్, డీటీ అజిత్‌కుమార్, ఆర్‌ఐ రామకిష్ణ్ర, ఏఈవో హరీశ్, డీపీఎం రాంమూర్తి తదితరులు ఉన్నారు.