Share News

ఉత్సాహంగా స్నాతకోత్సవం

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:49 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పా లమూరు యూనివర్సిటీ నాల్గవ స్నాతకోత్సవం కేరింత ల నడము ఉత్సాహంగా సాగింది.

ఉత్సాహంగా స్నాతకోత్సవం
గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా అందుకుంటున్న రుఖ్యబాను

పాలమూరు యూనివర్సిటీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పా లమూరు యూనివర్సిటీ నాల్గవ స్నాతకోత్సవం కేరింత ల నడము ఉత్సాహంగా సాగింది. పీయూ లైబ్రరీ ఆడి టోరియంలో గురువారం నిర్వహించిన వేడుకలకు చా న్స్‌లర్‌ హోదాలో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, ముఖ్యఅ తిథిగా ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ కంపెనీ వ్యవస్థాపకుడు మ న్నె సత్యనారాయణరెడ్డి, పీయూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఆడిటోరియంలో సీటింగ్‌ సదుపాయం తక్కువగా ఉండడంతో ముఖ్యఅతిథులు, అధికారులు, పట్టాలు పొందే విద్యార్థులను మాత్రమే అనుమతించా రు. మిగతా విద్యార్ధులు, తల్లిదండ్రులందరూ కార్యక్ర మం వీక్షించేందుకు ఆయా విభాగాలవద్ద ప్రత్యేక స్ర్కీ న్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని సామాజిక మాధ్య మాల ద్వారా ప్రత్యక్షప్రసారం చేశారు. కార్యక్ర మానికి కలెక్టర్‌ విజయేందిరబోయి, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పూర్వ వీ సీలు, డీన్‌లు, హెచ్‌ఓడీలు తదితరు లు పాల్గొన్నారు.

పతకం పొందిన ఆనంద వేళ

స్నాతకోత్సవం సందర్భంగా యూ నివర్సిటీలో సందడి నెలకొంది. బంగా రు పతకాలు సాధించిన విద్యార్ధులు తల్లి దండ్రులతో క్యాంపస్‌ కళకళలాడింది. పతకా లు అందుకున్న విద్యార్ధులు తమ లక్ష్యం సాధించిన ఆనందంలో కేరింతలు కొట్టారు. తల్లిదండ్రులు, స్నేహితుల తో కలిసి తమ ఆనందాన్ని పంచు కున్నారు.

గవర్నర్‌కు ఘన స్వాగతం

యూనివర్సిటీకి ఉదయం 11 గంటలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేరుకున్నారు. యూనివర్సిటీ వీసీ శ్రీని వాస్‌, కలెక్టర్‌ విజయేందిర బోయి, మన్నె సత్యనారాయణరెడ్డి, ఎస్పీ జానకి, రిజిస్టార్‌ పూస రమే ష్‌ బాబు గవర్నర్‌కు పూల బొకేతో ఘనస్వాగతం పతి కారు. పొలీసులు గవర్నర్‌కు గౌరవ వందనం చేశారు. అధికారులు మర్యాదపూర్వకంగా వర్సిటీ లాంఛనాలతో స్నాతకోత్సవ కార్యక్రమానికి చేరుకున్నారు. అనంతరం వర్సిటీ టాపర్లు 12 మందికి పీహెచ్‌డీ పట్టాలు, 83 మందికి బంగారు పతకాలు, 2,809 మందికి పీజీ, 18,666 మందికి యూజీ డిగ్రీలు అందజేశారు. ఉద యం 11.10కి మొదలైన కార్యక్రమం మఽధ్యాహ్నం 12.30కి పూర్తికాగానే, తిరిగి మరోసారి పోలీసులు గవ ర్నర్‌కు గౌరవ వందనం సమర్పించారు.

భారీ బందోబస్తు

మహబూబ్‌నగర్‌: పాలమూరులో గవర్నర్‌ పర్యటన సందర్భంగా పోలీసులు జిల్లా కేంద్రంలో భారీ బందోబ స్తు ఏర్పాటు చేశారు. పర్యటన పూర్తయ్యే వరకు జోగు లాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, ఎస్పీ జానకి పర్య వేక్షించారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యలు లేకుండా చ ర్యలు తీసుకున్నారు. అన్ని విభాగాల సమన్వయంతో బందోబస్తును విజయవంతంగా పూర్తి చేయడంతో సి బ్బందిని ఎస్పీ అభినందించారు.

Updated Date - Oct 16 , 2025 | 11:49 PM