Share News

దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:10 PM

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా క మిటీ సమావేశం ఆదివారం పట్టణంలోని సీఐ టీయూ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కాశప్ప అధ్యక్షతన నిర్వహించారు.

దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు
మాట్లాడుతున్న ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య

- ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య

నారాయణపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా క మిటీ సమావేశం ఆదివారం పట్టణంలోని సీఐ టీయూ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కాశప్ప అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ము ఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివ య్య హాజరై మాట్లాడుతూ... 2014 ఎన్నికల కంటే ముందు దివ్యాంగుల సంక్షేమానికి హామీ ఇచ్చిన మోదీ ఎందుకు అమలు చేయడం లేద న్నారు. 11 ఏళ్లలో దివ్యాంగుల్లో పేదరికం, నిరు ద్యోగం, ఆకలి చావులు పెరిగిపోతున్నాయని, 2020లో విధించిన లాక్‌డౌన్‌లో తమ జీవితా లలో తీవ్ర ప్రభావం చూపిందన్నారు. దివ్యాం గుల కోసమే ఉన్నామని గొప్పలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఏమీ చేసిందో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభు త్వం మోసం చేసిందని అన్నారు. పెన్షన్‌ పెంచే వరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కార్యదర్శి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దివ్యాంగుల కార్పొరేషన్‌ను బలో పేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీ సుకోవాలని డిమాండ్‌ చేశారు. బాబు, రంగ య్య, మల్లప్ప, నర్సప్ప, కృష్ణ, బాల రాజు, బస్వ రాజు, పెంటయ్య, మల్లేష్‌, గోవింద్‌, మల్లేష్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 11:10 PM