మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:17 PM
తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని జిల్లా అదనపు కలెక్టరు నర సింహారావు అన్నారు.
అదనపు కలెక్టర్ నరసింహా రావు
అలంపూర్‌లో ఎమ్మెల్యేతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ
అలంపూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని జిల్లా అదనపు కలెక్టరు నర సింహారావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన శనివారం అలంపూరు పట్టణంలో ఎమ్మెల్యే విజయుడుతో కలిసి చీరల పంపిణీ చేశారు. మహిళలు సంఘాలలో ఉంటూ రుణం తీసు కుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పారు. సంఘాలలో ఉన్నవారు ప్రమాదవశాత్తు మర ణిస్తే రూ.పది లక్షల బీమా వస్తుందని, రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుం దన్నారు. మహిళలకు బీఆర్‌ఎస్ హయాంలోనే న్యాయం లభించిందని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్ర మంలో తహసీల్దారు మంజుల, ఇస్మాయిల్, మార్కెట్ చైర్మన్ దొడ్డెప్ప, గ్రంథాలయ చైర్మన్ శ్రీనువాసులు ఉన్నారు.