Share News

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:05 PM

దివ్యాంగులను అన్నివిధాలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కార్యక్రమంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

  • జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

  • ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

గద్వాల టౌన్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగులను అన్నివిధాలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. దివ్యాంగుల సంక్షేమంతో పాటు వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్క రించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని ఇండో ర్‌ మైదానంలో దివ్యాంగులు, వయో వృద్ధులు, మహిళా సంక్షేమ శాఖ, గ్రామీణ మహిళాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమా న్ని మరో అదనపు కలెక్టర్‌ నర్సింగరావుతో కలిసి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం మా ట్లాడుతూ దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసు కోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ నర్సింగరావు మాట్లాడుతూ దివ్యాంగులైన మహిళల కోసం ప్రత్యేక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామని తెలిపా రు. అంతకుముందు దివ్యాంగులు స్థానిక పాత బస్టాండ్‌ సర్కిల్‌లో మానవహారం నిర్వహించా రు. అక్కడ నుంచి ర్యాలీగా ఇండోర్‌ స్టేడియానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధి కారి సునంద, డీఈవో విజయలక్ష్మి, డీవైఎస్‌వో కృష్ణయ్య, డీఆర్‌డీఏ ఏపీడీ శ్రీనివాసులు, డీసీపీ వో నరసింహా, జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ప్ర తినిధులు శ్రీనివాసులు, లక్ష్మణస్వామి, జిల్లా దివ్యాంగుల సేవాసంఘం నాయకులు ఉన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 11:05 PM