మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:46 PM
మైనా ర్టీల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొ రేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు.
పెబ్బేరు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : మైనా ర్టీల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొ రేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. మ హబూబ్ నగర్‌లోని ఆయన నివాసంలో ఆదివా రం పెబ్బేరు మండల యువజన సంఘం కాం గ్రెస్ జనరల్ సెక్రెటరీ ఎండీ ఆరీఫ్ మర్యాదపూ ర్వకంగా కలిసి మాట్లాడారు. మైనార్టీ కార్పొరేష న్ నుంచి పెబ్బేరు మండలంలోని మైనార్టీల అభ్యున్నతి కోసం అధికంగా నిధులు కేటాయిం చాలని కోరారు. స్థానికంగా ఉన్న మహిళలు, యువత స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీ సుకోవాలని కోరారు. మునిసిపాలిటీ, మండలం లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.