ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:07 AM
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో కి తీసుకువెళ్లాలి... ప్రజలకు వివరించాలని టీ పీసీసీ కార్యదర్శి, మహబూబ్‌నగర్ పా ర్లమెంట్ ఇన్‌చార్జి వేణుగౌడ్ పిలుపునిచ్చారు.
- బూత్‌స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు కాంగ్రెస్ బలోపేతం చేద్దాం
- రానున్న ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ప్రణాళికతో వెళ్దాం
- టీపీసీసీ కార్యదర్శి, మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి వేణుగౌడ్
నారాయణపేట, డిసెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో కి తీసుకువెళ్లాలి... ప్రజలకు వివరించాలని టీ పీసీసీ కార్యదర్శి, మహబూబ్‌నగర్ పా ర్లమెంట్ ఇన్‌చార్జి వేణుగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణ పేట సీవీఆర్ బంగ్లా లో డీసీసీ నూతన కా ర్యవర్గం ఏర్పాటుపై జరిగిన కీలక సమావే శానికి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌రె డ్డి అధ్యక్షత వహించా రు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇన్‌చార్జి వే ణుగౌడ్ ప్రసంగించా రు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడానికి కార్యా చరణ రూపొందించాలన్నారు. యువజన కాం గ్రెస్, మహిళా కాంగ్రెస్ పాత్రను బలోపెతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. రానున్న ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించేలా కా ర్యకర్తలు, నాయకులు పనిచేయాలన్నారు. పా ర్టీ కార్యకర్తల మధ్య సమన్వయంతో ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రజా సమస్యలు గుర్తిం చి పరిష్కారంతో పా టు ప్రభుత్వ సంక్షేమ ప థకాల గురించి ప్రజ ల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సోషల్ మీడియా పార్టీ కార్యక్రమాలు విస్తృత ప్రచారం చేయాల న్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శివంత్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, ముఖ్య నాయకులు ఉన్నారు.