Share News

రిటైర్డ్‌ ఉద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:16 PM

విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వ అనుసరిస్తు న్నతీరు ఆవేదన భరితంగా ఉందని ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ల క్ష్మారెడ్డి అన్నారు.

రిటైర్డ్‌ ఉద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం

  • ప్రభుత్వ తీరును నిరసిస్తూ 7న చలో హైదరాబాద్‌

  • రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి

  • సమ్మె పోస్లర్‌ విడుదల

గద్వాల టౌన్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వ అనుసరిస్తు న్నతీరు ఆవేదన భరితంగా ఉందని ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ల క్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రయోజనాల కోసం ఆందోళనబాట పట్టాల్సి రా వడం దురదృష్టకరమన్నారు. ఈనెల 7న తెలం గాణ రిటైర్డ్‌ ఉద్యోగులు తలపెట్టిన చలో హైద రాబాద్‌ ఆందోళన పోస్లర్లను మంగళవారం పట్టణంలోని సంఘం కార్యాలయం వద్ద విడుద ల చేశారు. ఈసందర్బంగా మాట్లాడిన లక్ష్మా రెడ్డి, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదు డీఏలను పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం రెండేళ్లుగా పీ ఆర్‌సీ ఏర్పాటుపై పెదవి విప్పకపోవడం శోఛ నీయమన్నారు. ఈహెచ్‌ఎస్‌తో పాటు పలు ప్ర యోజనాలు సాధించుకునేందుకు ఈనెల 7న హైదరాబాద్‌ ధర్నాచౌక్‌వద్ద తలపెట్టిన ఆందోళ నలో జిల్లా నుంచి పెన్షనర్లు పెద్దఎత్తున పా ల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సం ఘం ప్రధాన కార్యదర్శి చక్రధర్‌, కోశాధికారి బీసిరెడ్డి, ప్రతినిధులు కృష్ణారెడ్డి, బసవరాజు, వీర వసంతరాయుడు, సత్యనారాయణ, నరసిం హులు, పండరినాథ్‌, మోహన్‌రావు, వెంకటనా రాయణ ఉన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:16 PM