మాటలు కాదు.. చేతల ప్రభుత్వం
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:10 PM
గత పది సంవత్సరాలు పాలించిన ప్ర భుత్వం మాదిరిగా మాటలతో కూడుకున్నది కాదని.. మాది చేతల ప్రభుత్వం అని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
- మంత్రి వాకిటి శ్రీహరి
అమరిచంత, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : గత పది సంవత్సరాలు పాలించిన ప్ర భుత్వం మాదిరిగా మాటలతో కూడుకున్నది కాదని.. మాది చేతల ప్రభుత్వం అని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం ఉదయం అమరచింత ప్రభుత్వ హై స్కూల్ ఆవరణలో స్టేట్ మ్యా చింగ్ గ్రాండ్స్ ద్వారా 20లక్షల వ్యయంతో నిర్మించిన అదన పు తరగతి గదులు, సింగంపేట గ్రామంలో 12లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాలను రాష్ట్ర కాంగ్రెస్ కల్లుగీత కార్మిక విభాగం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నదని ఆయన అన్నారు. మాటలు చెబుతూ కాలం గడిపేవాళ్లం కాదని.. మాట ఇచ్చిన ప్రకారం పని చేసే ప్రభుత్వమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలను సైతం బలోపేతం చేయడానికి పూర్తిగా కృషి చేస్తున్నారని అన్నారు. పాఠశాలలు తెరిచిన వెంటనే ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు మొదటి రోజే అందించిన ఘనత తమదేనని అన్నారు. నాగరాజుగౌడ్, రెవెన్యూ, మండల పరిఽషత్, విద్యాశాఖ, ఈజీఎస్ పంచాయతీరాజ్ అధికారులతోపాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.