ప్రభుత్వ భూములు కాపాడాలి
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:36 PM
ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నా రు.
- భూ సమస్యల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
- కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నా రు. భూ భారతి, సాదాబైనామా తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రెవె న్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులలో 6,391 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో వివిధ స్థాయి ల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.. ఆ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. అదేవిధంగా ప్ర భుత్వ సంక్షేమ వసతి గృహాలను తహసీల్దార్‌లు తరుచుగా తనిఖీలు చేస్తుండాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, ఆయా మండలాల తహసీల్దార్లు ఉన్నారు.