Share News

పేటలో నేడు పర్యటించనున్న ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ

ABN , Publish Date - May 14 , 2025 | 11:11 PM

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు గురువారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం తొమ్మిది గంటలకు రోడ్డు మార్గంలో బయలు దేరి, పదకొండు గంటలకు నారాయణపేట మండలం అప్పక్‌పల్లికి చేరుకుంటారు.

పేటలో నేడు పర్యటించనున్న ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల పనుల పరిశీలన

జిల్లాలోని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష

పెట్రోల్‌ బంక్‌ నడుపుతున్న మహిళలతో మాటామంతి

నారాయణపేట, మే 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు గురువారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం తొమ్మిది గంటలకు రోడ్డు మార్గంలో బయలు దేరి, పదకొండు గంటలకు నారాయణపేట మండలం అప్పక్‌పల్లికి చేరుకుంటారు. అక్కడ నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జనరల్‌ మెడికల్‌ కళాశాల పనులను పరిశీలిస్తారు. పలు అభివృద్ధి పనుల గురించి సంబంధిత వైద్యశాఖ అధికారులతో సమీక్షిస్తారు. తర్వాత సింగారం చౌరస్తాలోని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా పెట్రోల్‌ బంక్‌ను పరిశీలించి, సభ్యులతో మాట్లాడతారు. మధ్యాహ్నం కలెక్టరెట్‌లో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం వికారాబాద్‌ జిల్లాకు వెళ్తారు. చీఫ్‌ సెక్రటరీ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Updated Date - May 14 , 2025 | 11:11 PM