Share News

గోపాష్టమిని ఘనంగా నిర్వహించాలి

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:24 PM

జిల్లాలోని ప్రతీ గ్రామంలో గోపాష్టమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్‌ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మళ్ళ సత్యం అన్నారు.

గోపాష్టమిని ఘనంగా నిర్వహించాలి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రతీ గ్రామంలో గోపాష్టమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్‌ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మళ్ళ సత్యం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి నుంచి 20వ తేదీ వరకు ప్రతీ సమితి పరిషత్‌లలో గోపాష్టమీని జరుపుకోవాలన్నారు. గిట్టుబాటు లేక గో సంపత్తి క్షీనమైపోతుందన్నారు. దీన్ని నివారించేందుకు వీహెపీ ఆధ్వర్యంలో గోపాలను ప్రోత్సహించాలన్నారు. గో ఆదారిత అమృత, గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల భూసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయన్నారు. రసాయన ఎరువులు వాడడం వల్ల పలు రకాల క్యాన్సర్‌ల భారిన ప్రజలు పడుతున్నారన్నారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల వెంకన్న, కార్యదర్శి నాగరాజు, విభాగ సహ కార్యదర్శి లక్ష్మీనారాయణ, కార్యదర్శి చంద్రయ్య, ఉపాఽధ్యక్షుడు హన్మంతు, జగ్పాల్‌రెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, రాజేంద్రమణి, నగర అధ్యక్షుడు విగ్నేష్‌కాంత్‌, మాతృశక్తి సహ సంయోజిక లావణ్య, కోశాధికారి శ్రీధర్‌బాబు, జిల్లా సహ కార్యదర్శి బుట్టా శ్రీనివాస్‌, గోవిందరెడ్డి, బాలశివుడు, ప్రాణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 11:25 PM