పట్టపగలే తాళంవేసిన ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు చోరీ
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:25 PM
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది.
- పరిశీలించిన డీఎస్పీ రమాణారెడ్డి
మిడ్జిల్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ సంఘటన ప్రజ ల్లో భయాందోళనకు రేకేత్తించింది. మండల కేంద్రానికి చెందిన సమ్మ నాగరాజు ఇంట్లో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళం విరగ్గొట్టి 13 తులాల బంగారు ఆభరణాలు, రూ. 12వేల నగదు ను అపహరించుకపోయినట్లు బాధితుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే సును నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఉదయం ఇంట్లో నివసించే వారు త మ వ్యక్తి గత పనులు, వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇం టికి రావడంతో తాళం వేసిన ఇల్లు తలుపులు తెరిచి ఉండటం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై శివనాగేశ్వర్‌నా యుడు క్లూస్‌టీం బృందానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చోరీ జరిగిన ఇంట్లో చోరీ చేసేందుకు ఉపయోగించిన వస్తువుల ఆనవాళ్లను సేకరించారు. వి షయం తెలుసుకున్న డీఎస్పీ రమాణారెడ్డి, జడ్చర్ల రూరల్ సీఐ నాగర్జునగౌడ్ లు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి, అక్కడే ఉన్న క్లూస్ టీం, స్థానిక పోలీసుల తో మాట్లడారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి చోరీకి పాల్పడిన వ్యక్తులను గు ర్తించి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఇప్ప టికే పోలీసులు చోరీ పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నాలను ము మ్మరం చేశారని వారు అన్నారు.