Share News

మహిషాసురమర్దినిగా జగన్మాత

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:18 PM

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజు బుధ వారం జగన్మాత మహిషాసురమర్దిని అలంక రణలో భక్తులకు దర్శనమిచ్చారు.

మహిషాసురమర్దినిగా జగన్మాత
గద్వాల కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారు

  • ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

  • అమ్మ వారికి మహిళల ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు

గద్వాల టౌన్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): దేవీశరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజు బుధ వారం జగన్మాత మహిషాసురమర్దిని అలంక రణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సంద ర్భంగా మహిళా భక్తులు పెద్దఎత్తున అమ్మ వారికి పూజలు, కుంకుమార్చనలు చేశారు. తొ మ్మిది రోజులుగా వివిధ రూపాల్లో దర్శనమి చ్చిన జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. గద్వాల పట్టణంలోని అన్నపూర్ణేశ్వరి, తాయ మ్మ, కాళికాదేవి, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో మహిషాసురమర్దినిగా, వీరభద్ర స్వామి ఆలయంలో రుద్రాక్ష రూపిణిగా, భక్త మార్కండేయ ఆలయంలో రాజరాజేశ్వరిగా కొ లువై భక్తులను కనువిందు చేశారు. అనం త రం సాయంత్రం అమ్మవారి ఆలయాల్లో మ హిళలు జగన్మాత పేరున సామూహిక కుంకు మార్చనలు నిర్వహించారు.

Updated Date - Oct 01 , 2025 | 11:18 PM