Share News

పాలమూరు సిగలోకి ‘గ్లామర్‌ ఎక్స్‌’

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:28 PM

పాలమూరు సిగలోకి సరికొత్త అధునాతన ‘గ్లామర్‌ ఎక్స్‌’ను జిల్లా కేంద్రంలోని అశ్విని హీరో షోరూంలో తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ సోమవారం ఆవిష్కరించారు.

పాలమూరు సిగలోకి ‘గ్లామర్‌ ఎక్స్‌’
వినియోగదారుడికి వాహనాన్ని అందజేస్తున్న ఒబేదుల్లా కొత్వాల్‌

- విడుదల చేసిన మైనార్టీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌

పాలమూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు సిగలోకి సరికొత్త అధునాతన ‘గ్లామర్‌ ఎక్స్‌’ను జిల్లా కేంద్రంలోని అశ్విని హీరో షోరూంలో తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ సోమవారం ఆవిష్కరించారు. షోరూం యజమాని దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ అధునాతనమైన రెడ్‌బై వైర్‌, కిక్‌ స్టార్ట్‌ విత్‌ రైడ్‌ బై వైర్‌ అను ఏరా సాంకేతికతను ఇది కలిగి ఉందన్నారు. వినియోగదారులకు ఆసక్తి మేరకు ఈకో, రోడ్‌, పవర్‌ మోడ్స్‌ ఉంటాయని పేర్కొన్నారు. స్మార్ట్‌ యుటిలిటీ స్పేస్‌తోపాటు మొబైల్‌ ఛార్జింగ్‌ సౌకర్యం ఉందన్నారు. అన్ని ఎల్‌ఈడీ ల్యాంపులు అమర్చారని 60 కంటే ఎక్కువ ఫీచర్లు గల 10.7 సెంటీమీటర్ల మల్టీ కలర్‌ డిజిటల్‌ మీటర్‌ కలిగి బ్లూటూత్‌ కనెక్టివిటీతో జీపీఎస్‌ నావిగేషన్‌ ఉందన్నారు. ఇది డిస్క్‌, డ్రమ్‌ అను రెండు వెరియంట్‌లలో నాలుగు రంగులలో లభ్యమౌతుందన్నారు. ఎక్స్‌షోరూం ధరలు డ్రమ్‌ రూ.84,809, డిస్క్‌ రూ.92,183 అందుబాటులో ఉందన్నారు.

మార్కెట్లోకి ‘హీరో ఎక్స్‌00యం160’

మహబూబ్‌నగర్‌ మార్కెట్లోకి నూతనంగా హీరో ఎక్స్‌00యం160 అనే స్కూటర్‌ను ఒబేదుల్లా కొత్వాల్‌ సోమవారం ఆవిష్కరించారు. యజమాని దిలీప్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఈ వాహనంలో శక్తివంతమైన 1600సీసీ లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌ కటింగ్‌ ఎడ్జ్‌, ఐ3ఎస్‌స్మార్ట్‌ సైలెంట్‌ సాంకేతిక కలిగి ఉందన్నారు. డిజిటల్‌ స్పీడో మీటర్‌తో బ్లూటూత్‌, నావిగేషన్‌ వసతి ఉందన్నారు. 14ఇంచుల పెద్ద టైర్స్‌ కలిగి పటిష్టమైన 240యంయం డిస్క్‌బైక్‌తో రెండు గదుల హెడ్‌ లాంప్‌, రిమోట్‌ సీట్‌ కలిగి ఉందన్నారు. దీనికి 7ఎల్‌ ట్యాంక్‌ కెపాసిటీతో ఈమోడల్‌ 4 కలర్లలో లభిస్తుందని, దీని ఎక్స్‌షోరూం ధర రూ.1,36,898 ఉందన్నారు. మేనేజింగ్‌ పార్టనర్‌ అశిష్‌, మేనేజర్‌ అతీఫ్‌, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 11:28 PM