ఎకరాకు రూ.30లక్షలు ఇప్పించండి
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:04 PM
మ ల్లమ్మకుంట రిజర్వాయర్ కింద భూములు కో ల్పోయిన రైతులకు ఎకరాలకు రూ.30లక్షలు ఇప్పించాలని బీజేపీ జిల్లా మాజీ అఽధ్యక్షుడు రా మచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
- బీజేపీ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్
అయిజ టౌన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): మ ల్లమ్మకుంట రిజర్వాయర్ కింద భూములు కో ల్పోయిన రైతులకు ఎకరాలకు రూ.30లక్షలు ఇప్పించాలని బీజేపీ జిల్లా మాజీ అఽధ్యక్షుడు రా మచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అ యిజలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఆర్‌డీఎస్ రైతులకు శాశ్వత సాగునీటి స మస్య పరిష్కారానికి మల్లమ్మకుంట రిజర్వాయ ర్ నిర్మాణం అవసరమని అన్నారు. కానీ ప్రస్తు తం కాంగ్రెస్ ఎంపీ మల్లురవి రిజర్వాయర్ ర ద్దు కోరుతూ కలెక్టర్‌కు లెటర్ ఇవ్వటం ఏమిట ని ప్రశ్నించారు. రిజర్వాయర్ కోసం సేకరించిన భూముల రైతుల ప్రయోజనాలను కాపాడాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఉంటే భూములను కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.30లక్షలు పరిహారం ఇప్పించాలన్నారు. ఎ న్నికల సమయంలో.. గెలిచిన వెంటనే మల్లమ్మ కుంట రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని చెప్పిన అఽధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పుడు ఈ సంఘటనపై రైతులకు సమాధానాలు చె ప్పాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, నాయకులు భీంసేన్‌రావ్, లక్ష్మన్‌గౌడు, అశోక్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.