ఉత్సాహంగా బాలికల కబడ్డీ పోటీలు
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:48 PM
గద్వాల జిల్లాకేంద్రం సమీపంలోని పూడూరు రోడ్డు సమీపంలోని ఎస్‌ఆర్ విద్యానికేతన్ పాఠశాలలో బాలికల కబడ్డీ టోర్నమెంట్ గురువారం ఉత్సాహంగా ప్రారంభమైంది.
ప్రారంభించిన బెటాలియన్ కమాండెంట్ జయరాజ్
గద్వాల, జూలై 10 (ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లాకేంద్రం సమీపంలోని పూడూరు రోడ్డు సమీపంలోని ఎస్‌ఆర్ విద్యానికేతన్ పాఠశాలలో బాలికల కబడ్డీ టోర్నమెంట్ గురువారం ఉత్సాహంగా ప్రారంభమైంది. సీబీఎస్‌ఈ క్లస్టర్-7 కబడ్డీ చాంపియన్‌షిప్ - 2025 పేరుతో నిర్వహిస్తున్న టోర్న మెంట్ నాలుగు రోజుల పాటు సాగనుంది. టోర్న మెంట్‌ను తొలిరోజు బీచుపల్లి పదవ బెటాలియన్ కమాం డెంట్ జయరాజ్ ముఖ్యఅతి థిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన జయరాజ్, మహిళలు క్రీడల్లోనూ రాణించి మహిళా సాధికారతకు ని జమైన గుర్తింపు తీసుకురావాలన్నారు. నాలు గు రోజులు సాగే టోర్నీలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ఇరవై పాఠశాలల నుంచి 31 జట్లు పాల్గొంటాయని పాఠశాల డైరెక్టర్ రా ములు తెలిపారు. కార్యక్రమంలో బెటాలియన్ డీఎస్పీ ఫణి, ఇన్‌స్పెక్టర్ కేఎన్ రాజు, ప్రిన్సిపా ల్ సునీత గోన ఉన్నారు.