Share News

నిమజ్జనానికి తరలిన గణనాథులు

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:41 PM

పట్టణంలోని పలు వాడల్లో వెలిసిన గణనాథులు 5వ రోజు పూజల అనంతరం నిమజ్జనానికి తరలాయి.

నిమజ్జనానికి తరలిన గణనాథులు
నిమజ్జనంలో పాల్గొన్న ఏనుగొండ దేవునిగుట్ట జర్నలిస్టు కాలనీవాసులు

- నగరంలోని పవనపుత్ర కాలనీలో రూ.1,11,116, మదిగట్లలో రూ.1.8 లక్షలు పలికిన లడ్డూ

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌/మహబూబ్‌నగర్‌ టౌన్‌/దేవరకద్ర/భూత్పూర్‌/మూసాపేట/పాలమూరు యూనివర్సిటి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని పలు వాడల్లో వెలిసిన గణనాథులు 5వ రోజు పూజల అనంతరం నిమజ్జనానికి తరలాయి. కొన్ని ప్రాంతాల నిర్వాహకులు రూరల్‌ మండలంలోని కోడూర్‌ చెరువులో నిమజ్జనం చేయగా, మరి కొందరు హన్వాడ చెరువులో నిమజ్జనం చేశారు. అంతరేమేందే పట్ణంలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భగీరథ కాలనీలోని శ్రీ నిలయంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద ఎస్పీ జానకి పాల్గొని పూజల అనంతరం అన్నదాన కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి భక్తులకు వడ్డించారు. బండమీదిపల్లిలోని బ్యాంకు కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద అన్నదానం నిర్వహించారు. ఎస్వీఎఎస్‌ హస్పిటల్‌ ఏర్పాటు చేసిన గణనాథుడిని మణ్యకొండ చెరువులో నిమజ్జనం చేశారు. ఏనుగొండ, వానవీకన్యకా పరమేశ్వరి ఆలయం, భగత్‌ సింగ్‌ విగ్రహం వద్ద, శ్రీ కృష్ణ టాకీస్‌, బండ్లగేరి, వీరన్నపేట, మోనప్పగుట్ట, పాన్‌చౌరస్తా, గడియారం చౌరస్తా, మ్యాక్సిక్యాబ్‌ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బండమీదిపల్లిలో మాజీ కౌన్సిలర్‌ లక్షీదేవి, మహిళా సంఘం నాయకులు రేణుక, రాణి, లావణ్య, అనురాధ పాల్గొన్నారు. పాలమూరు పట్టణంలోని వివిధ వినాయక మండపాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాగ్యలక్ష్మి కాలనీలోని వినాయక విగ్రహాం వద్ద నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరకద్ర, కౌకుంట్ల మండల కేంద్రాల్లో ఐదవ రోజు ఆదివారం గణనాథులు పూజలందుకుంటున్నాయి. భూత్పూర్‌ మండలం మదిగట్లలో వినాయక నిమజ్జన వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆంజనేయుస్వామి ఆలయం వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డును వేలం నిర్వహించగా, గ్రామానికి చెందిన కేసీరెడ్డి పురేందర్‌రెడ్డి రూ.1.8 లక్షలకు దక్కించుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అఽఽధ్యక్షుడు కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ నరసింహారెడ్డి పాల్గొన్నారు. మూసాపేట మండల కేంద్రంతో పాటు సంకలమద్ది గ్రామాల్లో వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంకలమద్దిలో ఉట్లు కొట్టారు. అనంతరం నిమజ్జనం చేశారు. జిల్లా కేంద్రంలోని కిషాన్‌నగర్‌లో సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Aug 31 , 2025 | 11:41 PM