Share News

పిడుగుపాటు మృతులకు అంత్యక్రియలు

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:35 PM

పిడుగుపాటుతో మృతులకు గురువారం అంత్యక్రియ లు పూర్తయ్యాయి. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండ లంలోని భూమ్‌పూర్‌లో సాయంత్రం 4గంటల ప్రాంతంలో పిడుగుపడింది.

పిడుగుపాటు మృతులకు అంత్యక్రియలు

అయిజ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పిడుగుపాటుతో మృతులకు గురువారం అంత్యక్రియ లు పూర్తయ్యాయి. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండ లంలోని భూమ్‌పూర్‌లో సాయంత్రం 4గంటల ప్రాంతంలో పిడుగుపడింది. ఈ సంఘటనలో ఇదే గ్రామానికి చెందిన సర్వేశ్‌, పార్వతి, పులిక ల్‌ గ్రామానికి చెందిన సౌభాగ్యమ్మ మృతి చెం దారు. వీరికి గురువారం గద్వాల ప్రభుత్వ ఆస్ప త్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వారికి వారి గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనతో పులికల్‌, భూమ్‌పూర్‌ గ్రామాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. పొలం పనులు చేసుకుంటున్న వారిని పి డుగు పొట్టన పెట్టుకుంది అంటూ కు టుంబ సభ్యులు గుండెలు పగిలేలా రో ధించారు. గద్వాల ఆర్‌డీవో అలివేలు కు టుంబ సభ్యులను పరామర్శించారు. ప్ర భుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషి యా, ఇందిరమ్మ ఇళ్లు, పిల్లలు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్న ట్లు తెలిపారు. అయిజ తహసీల్దార్‌ జ్యో తి, అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొడ్డప్ప, షెక్షావలిఆచారి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆదేశాల మేరకు బాధితులకు రావాల్సినవి సకాలంలో అందిస్తామన్నారు. దే వేంద్ర, జయన్న, భూమ్‌పూర్‌ నర్సింహారెడ్డి, నీలకంఠరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 11:35 PM