ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:45 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులదేనని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులదేనని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో గల ఓం ఫంక్షన్ హాల్‌లో పీఆర్‌టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అం దించారు. ఈ కార్యక్రమానికి యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి హాజరై పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ గతంలో డిగ్రీలో చదువుకునే పాఠ్యాంశాలు ఉన్న సిలబస్ ఇప్పుడు పదో తరగతిలో ఉందన్నారు. క్లిష్టమైన ఆ పాఠ్యాంశాలు పిల్లలకు నేర్పించాలంటే ఉపాధ్యాయులు కూడా కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోర్డులు చేశామన్నారు. మహబూబ్‌నగర్‌కు ఎలాంటి వనరులు లేవని, జ్ఞానమే వనరు అన్నారు. ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే సంకల్పం తమకే కాదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా ఉండటంతో మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మదన్‌మోహన్ యాదవ్, సుధాకర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు బుచ్చారెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు నారాయణ్‌గౌడ్ తదితరులు పాల్గోన్నారు.