Share News

రాజకీయాలకు అతీతంగా గ్రామాలకు నిధులు

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:07 PM

ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాలకు సమ ప్రాధాన్యంలో నిధులు, అభివృద్ధి పనులు కేటాయించడం తన ప్రాథమిక బాధ్యత అని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

రాజకీయాలకు అతీతంగా గ్రామాలకు నిధులు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

కాంగ్రెస్‌ మద్దతుదారులు గ్రామాల్లో రికార్డు స్థాయిలో గెలిచారు

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాలకు సమ ప్రాధాన్యంలో నిధులు, అభివృద్ధి పనులు కేటాయించడం తన ప్రాథమిక బాధ్యత అని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో తన నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించారన్నారు. 60 శాతం పార్టీ మద్దతుదారులు గెలిచారని, రాష్ట్రస్థాయిలో 56 శాతం వరకు పార్టీ నుంచి గెలువగా.. రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా మహబూబ్‌నగర్‌ రూరల్‌, హన్వాడ పరిధిలో అభ్యర్థులు గెలిచారన్నారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్‌కు 9,140 ఓట్లు వస్తే.. ప్రస్తుతం 12,500 ఓట్లు, హన్వాడ మండలంలో అసెంబ్లీ ఎన్నికల్లో 13,950 ఓట్లు వస్తే.. ప్రస్తుతం 18,417 ఓట్లు వచ్చాయని అన్నారు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్‌ తరఫునే ముగ్గురు అభ్యర్థుల వరకు పోటీచేయడం వల్ల ఓటమి చెందామన్నారు. అందుకు కిష్టంపల్లి ఉదాహరణగా చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో గతంలోలా బెదిరింపులు, పోలీసుల మోహరింపు, దాడులు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేశామని అన్నారు. నాయకులు సురేందర్‌రెడ్డి, మల్లు నర్సింహారెడ్డి, మహేందర్‌, ఎన్‌పీ వెంకటేశ్‌, వినోద్‌కుమార్‌, అనిత అందరూ కష్టపడి పనిచేశారని చెప్పారు. తండాలు కొంత బీఆర్‌ఎ్‌సకు మొగ్గుచూపగా.. మేజర్‌ పంచాయతీలన్నీ కాంగ్రెస్‌ గెలుచుకుందని అన్నారు. గెలిచిన వారు ఏకతాటిపై నడిచి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సీఎం అండతో నిధులు తెస్తానన్నారు. ఇతర పార్టీల నుంచి రావడానికి చాలామంది రెడీగా ఉన్నారని, కానీ హడావుడి చేసి.. ఏదో గొప్పలు చెప్పుకోవాలని అనుకోవడం లేదన్నారు. తన దగ్గరకు వస్తే పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు మంజూరు చేస్తానని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ బెక్కరి అనిత, నాయకులు మారేపల్లి సురేందర్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేష్‌, వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 11:07 PM