కళాశాలల నిరవధిక బంద్‌కు పూర్తి మద్దతు
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:58 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం ప్రైవేటు కళాశాల లు చేస్తున్న పోరాటానికి తాము పూర్తిగా సహకరిస్తామని బీఆర్‌ఎస్వీ జోగుళాంబ గద్వాల జిల్లా కో ఆర్డినే టర్ కురువ పల్లయ్య అన్నారు.
బీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య
గద్వాల టౌన్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం ప్రైవేటు కళాశాల లు చేస్తున్న పోరాటానికి తాము పూర్తిగా సహకరిస్తామని బీఆర్‌ఎస్వీ జోగుళాంబ గద్వాల జిల్లా కో ఆర్డినే టర్ కురువ పల్లయ్య అన్నారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదల కోరుతూ కళాశాలల నిరవధిక సమ్మెకు పిలుపుపునిచ్చిన యాజమాన్యాలకు తాము అండగా ఉంటామ న్నారు. ఆదివారం పట్టణంలోని జిల్లా గ్రంథాల యం విద్ద నిరుద్యోగులతో కలిసి పల్లయ్య విలే కరులతో మాట్లాడారు. వివిధ కోర్సులకు సం బంధించి ప్రభుత్వంనుంచి కళాశాలలక రూ.9వే ల కోట్ల నిధులు పెండింగ్‌లో ఉండటం శోఛనీ యమన్నారు. రెండేళ్ల క్రితం ఇచ్చిన రూ.1200 కోట్ల విలువైన టోకెన్లకు ఇప్పటికీ చెల్లింపులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శన మన్నారు. రాష్ట్రంలో దాదాపు 13లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో విద్యనభ్యశి స్తుండగా ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ నిధుల రానందున కోర్సులు పూర్తయినా విద్యా ర్థులకు ధ్రువపత్రాలు అందడం లేదన్నారు. రెం డేళ్లుగా కేవలం మాటలతోనే కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల విడుదలలో మా త్రం మొండిచేయి చూపుతుండటం సిగ్గుచేట న్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీ ఆర్‌ఎస్వీ వారికి అండగా ఉండి పోరాడుతుంద న్నారు. సమావేశంలో మాధవ్, నటరాజ్, మహేశ్ ఉన్నారు.