ఫోన్ ట్యాపింగ్‌తో స్వేచ్ఛను హరించారు
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:20 PM
పాలమూరులో బీఆర్‌ఎస్ పాలనలో ప్రతిపక్షాలకు చెందిన చోటామోటా నాయకుల నుంచి ముఖ్య నాయకులందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రజల స్వేచ్ఛను హరించారని ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఆరోపించారు.
మహబూబ్‌నగర్, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : పాలమూరులో బీఆర్‌ఎస్ పాలనలో ప్రతిపక్షాలకు చెందిన చోటామోటా నాయకుల నుంచి ముఖ్య నాయకులందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రజల స్వేచ్ఛను హరించారని ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచా రణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో మున్నూరు రవి, మైత్రి యాదయ్య, బాండేకర్ విశ్వనాథ్, గోనెల శ్రీనివాసులు మాట్లాడారు. మాజీ మంత్రి తమపై ఎన్నో తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా తమ ఫోన్లు ట్యాపింగ్ చేసి మానసికంగా హింసించారన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోవాలని, కానీ ట్యాపింగ్ చేసి లొంగదీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీయించడం, లేదంటే దూర ప్రాంతాలకు బదిలీ చేయించారని విమ ర్శించారు. అన్ని సాక్షాలతో పోలీసులను కలిశా మని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా మన్నారు. వెంటనే సంబంధిత నాయకుడితో పాటు వారి సహాయకులు, అనుచరులపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.