Share News

ప్రజాపాలన పేరుతో మోసం

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:09 PM

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందని నాగర్‌ క ర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి ఆరో పించారు.

ప్రజాపాలన పేరుతో మోసం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

కార్యకర్తలసమావేశంలో మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి

అమ్రాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందని నాగర్‌ క ర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి ఆరో పించారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఉమ్మడి అమ్రాబాద్‌ మండల కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. 21 నెలల కాంగ్రెస్‌ పాలనలో ఇచ్చిన హామీలల్లో ఏ ఒక్కటీ పూర్తి స్థాయి లో నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ఆరు గ్యారెంటీలు, 420హామీలను ప్రజలకు వివరి స్తూ ముందుకు పోవాలని నాయకులు, కార్య కర్తలకు ఆయన సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మండలంలో మె జార్టీ స్థానాలను సాధించే దిశగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ నాయ కత్వంలో రాష్ట్రంలో తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని ఎవరు భయపడాల్సినవసరం లేదని కార్యకర్తలకు మనోధైర్యం కల్పించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు నరసింహ గౌడ్‌, మండల నాయకులు చెన్నకేశవులు, రవీందర్‌రెడ్డి, వెంకటయ్యయాదవ్‌, కిట్టు పటే ల్‌, జయరాం, పార్టీ నాయకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 11:09 PM