ఉద్యోగం పేరిట మోసం
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:08 PM
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన సంఘటన చోటు చేసుకుంది.
గోపాల్‌పేట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోని వచ్చిన సంఘటనపై తెలిసిన వారు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన ఓ మహిళ వికలాంగురాలు... ఆమెకు మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి నీకు మెడికల్ కాలేజీలో మెడికల్ మందులు పంపిణీ చేసే దాంట్లో ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో ఆమె రూ.3 లక్షల వరకు డబ్బులు ఇచ్చింది. రోజులు గడుస్తున్నా సదరు మహిళ ఉదోగ్యం ఏమైంది అని అడిగినా దాటవేస్తూ వచ్చాడు. మోసపోయానని భా వించిన సదరు మహిళ తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరింది. దీంతో అత డు పలుమార్లు సమయం చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఫైనల్‌గా కు టుంబంతో సహా హైదరాబాద్ వెళ్లిపోయాడు. కాగా, ఈ సంఘటనపై బుధ వారం ‘ఆంధ్రజ్యోతి’ పోలీసులను వివరణ కోరగా, బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.