వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
ABN , Publish Date - May 17 , 2025 | 11:14 PM
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శనివారం వివిధ సంఘటనల్లో నలుగురు మృత్యువాత పడ్డారు.
నారాయణపేట/నారాయణపేట టౌన్/ మక్తల్/ఊట్కూర్, మే 17 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శనివారం వివిధ సంఘటనల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. నారాయణపేట మండలం ఎక్లాస్‌పూర్ మార్గంలో గుర్మిట్కల్‌కు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు గుర్మిట్కల్ నుంచి పేటకు వస్తున్న జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మక్తల్ పట్టణంలో బైక్‌పై వెళ్తున్న యువతిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఆమె ఎగిరిపడి కింద పడింది. ఆ వెంటనే లారీ ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఊట్కూర్ మండలం కొల్లూర్ గ్రామంలో వ్యవసాయ కూలీ మాల శంకరప్ప(50) పాత గోడను కూల్చేందుకు వెళ్లగా అది కూలి అక్కడికక్కడే మృతి చెందాడు.
కర్ణాటక ఆర్టీసీ బస్సు, జీపు ఢీకొని..
జీపును కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గా యపడ్డారు. ఈ విషాదకర సంఘటన నారా యణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామ సమీపం లోని కర్ణాటక సరిహద్దులో శనివారం చోటు చేసుకున్నది. నారాయణపేట నుంచి కర్ణాటక వైపు వెళుతున్న కర్ణాటక ఆర్టీసి బస్సు గాజల్‌కోట్రికే నుంచి ఆరుగురు ప్రయాణికులతో నారా యణపేట వైపు వస్తున్న జీపును ఎక్లాస్‌పూర్ గ్రామ రోడ్డు మలుపు వద్ద ఢీకొన్నది. దీంతో జీపులో ఉన్న నారాయణపేట జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడకు చెందిన శిరీష(10), కర్ణాటక రాష్ట్రంలోని సీపురం గ్రామానికి చెందిన అనంతమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తర లించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హుసేనప్పను 108 అంబులెన్స్‌లో మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పట్ట ణానికి చెందిన శిరీష మృతితో బంధువుల రోద నలు మిన్నంటాయి. జీపు డ్రైవర్ చిన్న, మల్లికా ర్జున్ అందులో ప్రయాణిస్తున్న కుమ్మరి ఉషన్న, కోటగిరి నరసింహ, కోటగిరి శరణమ్మ, కుమ్మరి బాలకృష్ణలకు కూడా తీవ్ర గాయాలు అయ్యా యి. వారిని జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుప త్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. తీవ్రం గా గాయపడిన కుమ్మరి ఉషన్నను మహబూబ్‌నగర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ విషయం పై నారాయణపేట టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, రేవతి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కర్ణాటక బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
లారీ ఢీకొని యువతి..
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందిన సంఘటన మక్తల్ పట్టణంలోని క్రిస్టల్ హోటల్ వద్ద శనివారం రాత్రి 7 గంటలకు చోటు చేసు కుంది. ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మక్తల్ మండలం చిన్న గోప్లా పూర్ గ్రామానికి చెందిన జానకి(32) తన తల్లి గారి గ్రామమైన చందాపూర్ గ్రామానికి తమ్ము డు రమేష్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఎగిరి రోడ్డుపై పడింది. ఆ వెంటనే లారీ ఆమె తలపై నుంచి దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. జానకికి 14 ఏళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై మృతురాలి భర్త రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గోడ మీదపడి వ్యక్తి..
పాత ఇంటిని కూల్చడానికి కూలీ పనికి వెళ్లి పని చేస్తుండగానే గోడ మీద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం కొల్లూర్ గ్రామంలో శనివా రం చోటు చేసుకుంది. గ్రామస్థులు, ఊట్కూర్ ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూర్ గ్రా మానికి చెందిన మాల శంకరప్ప(50) గ్రామంలో వ్యవసాయ కూలీ పనితో పాటు గ్రామంలో లభించే ఇతర కూలీ పనులను చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న గ్రామానికి చెందిన మంగలి లక్ష్మమ్మ అనే మహిళ ఇటీవలే గ్రామానికి వచ్చి తన పాత ఇంటిని కూల్చి వాటి స్థానంలో కొత్త ఇంటి నిర్మాణం చేయడానికి పూనుకుంది. దాని కోసం గ్రామానికి చెందిన మేస్త్రీ పసుల గోపాల్‌కు పా త ఇంటిని కూల్చి కొత్త ఇంటి నిర్మాణం చేసి ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. అనంతరం మే స్త్రీ పసుల గోపాల్ పాత ఇంటిని కూల్చే పను లు ప్రారంభించాడు. శనివారం ఇంటిని కూల్చే పనులకు కూలీకి వెళ్లిన శంకరప్పపై ఒక్క సారిగా గోడ మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కు టుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఎస్‌ఐ కృష్ణంరాజు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆసుపత్రికి తరలించారు. భార్య మాల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణంరాజు తెలిపారు.