అభివృద్ధి దిశగా ముందుకు..
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:38 PM
అమరవీరుల త్యాగాల పునాదులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి అన్నారు.
- రాష్ట్ర ప్రగతిలో అన్నివర్గాల ప్రజలు మమేకం కావాలి
- తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి
- పేటలో అట్టహాసంగా అవతరణ దినోత్సవం
- జాతీయ పతాకం ఆవిష్కరణ
నారాయణపేట టౌన్/నారాయణపేట, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): అమరవీరుల త్యాగాల పునాదులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినో త్సవ వేడుకల స్ఫూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్నివర్గాల ప్రజలు మమేకం కావా లని పిలుపునిచ్చారు. పేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడు కలు అట్టహాసంగా జరిగాయి. వేడుకలకు గురునాథ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిం చారు. ఆ తర్వాత మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని పేర్కొ న్నారు. వేడుకల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, మార్కె ట్ చైర్మన్ శివారెడ్డి, ఆర్డీవో రాంచందర్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొ న్నారు.
అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే, ఆర్డీవో, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తదితరులు పూల మాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
అలాగే, పేట జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.