Share News

మాజీ ప్రధాని వాజపేయి సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:45 PM

అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ పాలన సాగించిన అటల్‌ బిహారీ వాజపేయి సుపరిపాలనకు ఆద్యుడుగా ప్రజామన్ననలు పొందారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు బం డల వెంకట్రాములు అన్నారు.

మాజీ ప్రధాని వాజపేయి సేవలు చిరస్మరణీయం
గద్వాలలో వాజపేయి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు

  • బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు బండల వెంకట్రాములు

  • ఘనంగా మాజీ ప్రధాని 101వ జయంతి

గద్వాల టౌన్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ పాలన సాగించిన అటల్‌ బిహారీ వాజపేయి సుపరిపాలనకు ఆద్యుడుగా ప్రజామన్ననలు పొందారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు బం డల వెంకట్రాములు అన్నారు. సమాఖ్య స్ఫూర్తి ని చాటుతూ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుం టూ ఆయన సాగించిన పాలన భవిష్యత్‌ తరా నికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 101వ జయంతిని పురస్కరించుకుని గురువారం పట్టణంలోని డీకే బంగ్లాలో నాయకులు వాజపేయి చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో బీజేపీ పట్టణ నాయకులు జయశ్రీ, మ హిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు సమత, నాయ కులు రవికుమార్‌ ఎగ్బేటే, శ్యాంసుందర్‌రావు, అనిల్‌, కృష్ణ, శ్రీను, తిమ్మన్న, పాండు, బుజ్జి, నరసింహులు ఉన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 11:45 PM