ఘనంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జన్మదినం
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:24 PM
మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

- బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్
మహబూబ్‌నగర్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను మాజీ మంత్రి కట్ చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన ఆయనను న్యూటౌన్ చౌరస్తా నుంచి కార్యకర్తలు భుజాలపై మోసుకుని పార్టీ కార్యాలయం స్టేజీ వరకు తీసుకొచ్చారు. అంతకుముందు మయూరి నర్సరీ, బైపాస్ వద్ద కార్యకర్తలు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డా.సి లక్ష్మారెడ్డి శ్రీనివాస్‌గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ గౌరవాన్ని పెంచేలా పనిచేయాలి : మాజీ మంత్రి
తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి తెచ్చుకున్నామని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దీని గ్రేడ్ పెరుగుతుండాలే తప్పా తగ్గకూడదన్నారు. రాష్ట్ర ప్రభభుత్వం మంచి విధానంతో ముందుకెళ్లాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మంచి పాలన అందించాలని సూచించారు. జిల్లా, నగర అభివృద్దికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా శ్రీనివాస్‌గౌడ్ కీలకపాత్ర పోషించారన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, కోరమోని నర్సింహులు, గంజి ఎంకన్న, గోపాల్‌యాదవ్, ఆంజనేయులు, శివరాజు, శ్రీకాంత్‌గౌడ్, కొండ లక్ష్మయ్య, జంబులయ్య, నవకాంత్, రాము, మున్నూరు రాజు పాల్గొన్నారు.