Share News

మహిళలకు పెద్దపీట

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:05 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

మహిళలకు పెద్దపీట
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే యెన్నం, కలెక్టర్‌

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- కలెక్టర్‌తో కలిసి మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌/న్యూటౌన్‌/రూరల్‌, హన్వాడ నవంబరు 25 (ఆంరఽధజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని, కలెక్టర్‌ విజయేందిర బోయితో కలిసి 1,539 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.1,84,39,513 రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సంక్షేమమే ధ్యేయంగా రెండేళ్లలోనే జిల్లాలో మహిళలకు రూ.20 కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పథకాలు అమలు చేస్తోందన్నారు. అంతకుముందు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం అల్లీపూర్‌లో నిర్మించిన 40 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి లబ్ధిదారులకు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన సంజీవ్‌ ముదిరాజ్‌ను సన్మానించారు. అదే విధంగా మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం ఓబ్లాయిపల్లి (మన్యంకొండ)లో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌, తెలుగు గూడెంలో బీటీరోడ్డు, కోటకదిరలో ముదిరాజ్‌ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. హన్వాడ మండలం వేపూర్‌, గొండ్యాల, కిష్టంపల్లి, అయోధ్యనగర్‌, మునిమోక్షం, హన్వాడ, కొత్తపేట గ్రామాల్లో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిదులు రూ.2.50 కోట్లతో సీసీరోడ్డు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కిష్టంపల్లి నుంచి జూలపల్లి వరకు రూ.1.50 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. అయోధ్యనగర్‌, కొత్తపేట, మునిమోక్షం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనిత, జిల్లా మత్స్య పారిశ్రమిక సహకార సంఘం పర్సన్‌ గోనెల శ్రీనివాసులు, డీఆర్డీవో నర్సింహులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ ఖాద్రీ, ఆర్డీవో నవీన్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ పీవీ రమేష్‌, ఏఈ నర్సిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీవో కరుణశ్రీ, నాయకులు శాంతన్నయాదవ్‌, రామచంద్రయ్య, మాధవరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గోవింద్‌యాదవ్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:05 PM