Share News

చివరి రక్తపు బొట్టు వరకు బీసీల కోసమే

ABN , Publish Date - Apr 18 , 2025 | 11:38 PM

పదవులపై ఎప్పుడూ ఆశ పె ట్టుకోలేదని, తన చివరి రక్తపు బొట్టు వరకు బీసీల కోసమేనని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు.

చివరి రక్తపు బొట్టు వరకు బీసీల కోసమే

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

నాగర్‌కర్నూల్‌లో బీసీ జన చైతన్య సభ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : పదవులపై ఎప్పుడూ ఆశ పె ట్టుకోలేదని, తన చివరి రక్తపు బొట్టు వరకు బీసీల కోసమేనని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. ఇక ముందు ఎట్టి పరిస్థితిల్లోనూ అగ్రకుల పార్టీలకు సేవ చేసేది లేదని స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్‌ హాలులో, బీసీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బీసీ జన చైతన్య సభ నిర్వహించారు. ఫూలే ట్రస్టు వ్యవస్థాపకుడు పచ్చిపాల సుబ్బయ్య అధ్య క్షతన నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథి గా ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, అతిథులుగా బీసీ జన చైతన్య వేదిక వ్యవస్ధాపక అధ్యక్షుడు డాక్టర్‌ దాసరి అజయ్‌కుమార్‌యాదవ్‌, విశ్రా ంత డీఈవో ప్రొఫెసర్‌ శివార్చక విజయ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ప ంచాయతీ మొదలైందని, అగ్రకుల నాయకుల గోత్రం, పుట్టు పూర్వోత్తరాలతో సహా తాను బయటపెట్టాన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు అమలు చేసే వరకు ఉద్యోగాలకు నోటి ఫికేషన్లు వేయొద్దని, కాదని ఉద్యోగాల భర్తీకి పోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుర్చీ వచ్చే ఎన్నికల దాకా ఉండదని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలనా అనుభవం లేద ని, కేవలం మోసం, దగా, వంచనలో అనుభవం ఉందని విమర్శించారు. సీఎంకు ఉన్న లలితకళలను ఉపయోగించి తప్పుడు కులగణనతో బీసీలను తక్కువగా చూపించారని ఆరో పించారు. బీసీలంటే తక్కువ కాదని, బీసీలం టే బిగ్గెస్ట్‌ క్లాస్‌ అన్నారు. బీసీ కులాలన్నీ ఒక్క టై మన కుర్చీలను మనం తీసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం అసిస్టెంట్‌ ప్రొఫె సర్‌ డాక్టర్‌ పెబ్చేటి మల్లికార్జున్‌ బీసీ డిక్లరే షన్‌ను ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్ల న్న చేతుల మీదుగా బీసీ రచ్చబండ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుంకర రమాదేవి రాసిన భారత రాజ్యాంగ పుస్తకాలను విద్యార్థినులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సుదగాని హరిశంకర్‌గౌడ్‌, రాష్ట్ర స మన్వయకర్త వట్టె జానయ్యయాదవ్‌, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు బైకని శ్రీనివాస్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గంగనమోని కిరణ్‌, బహుజన టీచర్స్‌ అసోసియే షన్‌ జిల్లా అధ్యక్షుడు చీర్ల భాస్కర్‌, బీసీ సం క్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుంభం మల్లేష్‌గౌడ్‌, గెస్టు లెక్చరర్స్‌ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సదానందంగౌడ్‌, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు లాలుయాదవ్‌, ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధా న కార్యదర్శి కోళ్ల శివ, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బోనాసి రాంచందర్‌, అసెంబ్లీ ఇన్‌చార్జి కొ త్తపల్లి కుమార్‌, డీటీయూ జిల్లా అధ్యక్షుడు గుడిపల్లి నిరంజన్‌, మత్స్యశాఖ జిల్లా అధ్య క్షుడు వాకిటి ఆంజనేయులు, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు ఓర్సు బంగారయ్య, తీన్మార్‌ మల్లన్న టీం పరశురాం, శివ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 11:38 PM