స్వయం ఉపాధి పొందేందుకే.. సెట్విన్ శిక్షణ కేంద్రం
ABN , Publish Date - Nov 15 , 2025 | 10:57 PM
ఏదైన ఒక రంగంలో నిష్ణాతులై స్వయం ఉపాధి పొందేందుకే సెట్విన్ శిక్షణ కేంద్రంను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.
- స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఏదైన ఒక రంగంలో నిష్ణాతులై స్వయం ఉపాధి పొందేందుకే సెట్విన్ శిక్షణ కేంద్రంను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని సెట్విన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న వివిధ విభాగాల్లోని వారికి స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేసి, మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో సెట్విన్ కేంద్రం ఉండడంతో జడ్చర్లలో ప్రారంభించేందుకు విముఖత చూపారని, రూ.20 లక్షలు వెచ్చించి భవనాన్ని పునఃనిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందుతున్న 350 మంది విద్యార్థులకు అయ్యే ఖర్చు సొంతంగా భరిస్తానని వెల్లడించి, ఇప్పటికే రూ.4.50 లక్షలు సెట్విన్‌కు చెల్లించినట్లు తెలిపారు. అంతకుముందు మండలంలోని మల్లెబోయిన్‌పల్లి, శంకరాయపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సెట్విన్ కోఆర్డినేటర్ విజయ్‌కుమార్, మునిసిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, కమిషనర్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నిత్యానందం, బుక్క వెంకటేశ్, చైతన్యచౌహన్, రమేశ్, లత, గాంగ్యానాయక్, బాలకృష్ణ, రఘు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం
మిడ్జిల్ : మత్స్యకారుల సమంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని నల్లచెరువులో చేపపిల్లలను వదిలి, మాట్లాడారు. 2025-26 సంవత్సరానికి నియోజకవర్గంలోని 389 చెరువులకు 49.53 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మార్కెట్ ఛైర్మన్ జ్యోతిఅల్వాల్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్వాల్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రబ్బాని, నాయకులు గౌస్, సాయిలు, వెంకటయ్య, సంపత్‌కుమార్, మల్లికార్జున్‌రెడ్డి, నరసింహ, నరేందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, బండారి వెంకటయ్య, శంకర్‌నాయక్, శంకర్‌ముదిరాజ్, రాముగౌడ్, జహీర్, లక్ష్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి, పర్వతాలు పాల్గొన్నారు.