Share News

సాయుధ పాఠశాలలో ఫుడ్‌ ఫెస్టివల్‌

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:04 PM

ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ బెటాలియన్‌ ఆవరణలో ఉన్న సాయుధ చైతన్య పాఠశాలలో శుక్రవారం ఫుడ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్‌ జయరాజ్‌ హాజరయ్యారు.

సాయుధ పాఠశాలలో ఫుడ్‌ ఫెస్టివల్‌
విద్యార్థులు తెచ్చిన వంటలను రుచి చూస్తున్న కమాండెంట్‌

- హాజరైన 10వ బెటాలియన్‌ కమాండెంట్‌ జయరాజ్‌

ఎర్రవల్లి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ బెటాలియన్‌ ఆవరణలో ఉన్న సాయుధ చైతన్య పాఠశాలలో శుక్రవారం ఫుడ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్‌ జయరాజ్‌ హాజరయ్యారు. ఫుడ్‌ ఫెస్టివల్‌లో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ, ఆధునిక వంటలను తయారు చేసుకుని వచ్చారు. విద్యార్థుల సృజనాత్మకతను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు సామూహిక చైతన్య భావాన్ని పెంపొందిస్తాయన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికీతీసి, ఆనందాన్ని ఇచ్చే వేదికలని పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు, తల్లితండ్రులకు అభినందనలు తెలిపారు. ప్రత్యేకించి విద్యార్థులు తెచ్చిన వంటను రుచి చూసిన కమాండెంట్‌ ఆహా ఏమి రుచి అని కితాబిచ్చారు.

Updated Date - Dec 12 , 2025 | 11:04 PM