Share News

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి

ABN , Publish Date - May 27 , 2025 | 11:17 PM

పెండింగ్‌లో ఉన్న కేసులను తగ్గించేందుకు పోలీసులు సంబంధిత అధికారులతో కలిసి సమన్వయంతో పని చేసి నేరాల నియంత్రణ పై దృష్టి సారించాలని డీఎస్పీ లింగయ్య అన్నారు.

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ లింగయ్య

- డీఎస్పీ లింగయ్య

నారాయణపేట న్యూటౌన్‌, మే27 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న కేసులను తగ్గించేందుకు పోలీసులు సంబంధిత అధికారులతో కలిసి సమన్వయంతో పని చేసి నేరాల నియంత్రణ పై దృష్టి సారించాలని డీఎస్పీ లింగయ్య అన్నారు. మంగళవారం నారాయణపేట డీఎస్పీ కార్యాలయంలో మక్తల్‌, మరికల్‌, కోస్గి పోలీస్‌ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కేసు నమోదు నుంచి చార్జిషీట్‌ వరకు ప్రతీ విషయాన్ని పరి శోధన చేసి పైనల్‌ చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నమోదు అయిన గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసుల్లో ఇన్వెస్టిగేషన్‌ ఏవిధంగా చేయాలి అనే అంశాలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో, గ్రేవ్‌ కేసులో త్వరగా విచారణ చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలన్నారు. కేసుల చేధనలో టెక్నాలజీని వాడుకొని ప్రజల మన్ననలు పొందాలన్నారు. మిస్సింగ్‌ కేసులను చేధించి, నేరాల నియంత్రణకు నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో సీఐలు రామ్‌లాల్‌, సైదులు, ఎస్‌ఐలు భాగ్యలక్ష్మి రెడ్డి, అశోక్‌బాబు, నవీద్‌, విజయ్‌కుమార్‌, బాలరాజు, స్టేషన్‌ రైటర్స్‌ పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:17 PM