వరికి వరదపోటు
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:06 PM
పాలమూరులో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేయడంతో పాటు వ్యవసాయ పంట లపైనా ప్రభావం చూయించాయి.
- పత్తి పంటపైనా ప్రభావం
- పలు గ్రామాల్లో కుంటలు, చెరువులకు గండ్లు
- నష్టం అంచనా వేయడంలో అధికారుల తాత్సారం
- జిల్లాలో 675 ఎకరాల్లో పంటలు నష్ట పోయినట్లు అంచనా
- అంతకన్నా ఎక్కువే నష్టం జరిగిందంటున్న రైతులు
మహబూబ్‌నగర్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): పాలమూరులో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేయడంతో పాటు వ్యవసాయ పంట లపైనా ప్రభావం చూయించాయి. భారీ వర్షాల కార ణంగా వ్యవసాయ రంగానికి ఎంతో ప్రయోజనం చే యడంతో పాటు మరో రెండు, మూడేళ్లు భూగర్భ జలాలకు ఢోకా లేదు. భూగర్భ జలాలు పెరగానికి ఈ వర్షాలు ఎంతో మేలు చేయడంతో బోర్లు రీచార్జి అవుతాయి. అయితే భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి ప్రవహించడం, కొన్ని మండలాల్లో కుంటలు తెగడం, చెరువులకు గండ్లు పడటం వంటి కారణాల తో వరిపంట నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు రేగడి, సౌడు నేలల్లో పత్తిసాగు చే సిన రైతులకు ఇబ్బందులు తప్పలేదు. పంట జాలు వారి ఎరుపెక్కి తెగుళ్ల బారిన పడటం, కలుపు పెరి గిపోవడం వంటి నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. జిల్లాలో అధికారులు నష్టం అంచనా వేసినా అంతకు మించే నష్టం జరిగినట్లు తెలుస్తుండగా, ఇతర జి ల్లాలతో పోలిస్తే పాలమూరు జిల్లాలో తక్కువ నష్ట మే జరిగినట్లు స్పష్టమవుతోంది.
కుంటలు తెగి..ముంపునకు గురైన వరి
జిల్లాలో పలు మండలాల్లో కుంటలు, కాలువలు తెగడం వంటి కారణాలతోనే వరి పంట నీట ముని గింది. మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో చెరువు అలుగు పారి ఆ నీరు కేఎల్‌ఐ కాలువ ద్వారా మరో చెరువులోకి వెళ్లాల్సి ఉండగా, ఆ కాలువ తెగి పోవడం వల్ల దిగువన ఉన్న 32 ఎకరాల్లో వరి పంట దెబ్బతినింది. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రా మం క్రాంతినగర్‌లో చెరువు అలుగు పారి కాలు వ తెగడం వల్ల అప్పుడే నాటిన 14 ఎకరాల వరి పంటపైనుంచి వరద వెళ్లడంతో వేసినదంతా దె బ్బతినింది. మహబూబ్‌నగర్ మండలం ఫతేపూ ర్ గ్రామంలో మాదిగవని కుంటకు గండి పడ టం వల్ల దిగువన సాగుచేసిన 20 ఎకరాల వరి పంట పూర్తిగా మునిగిపోయింది. గండికి మర మ్మతు చేసే పరిస్థితి లేకపోవడంతో చెరువు ఖా ళీ అయింది. మహ్మదాబాద్ మండలం ధర్మాపూ ర్ గ్రామంలో కుంట తెగిపోవడంతో దిగువన ఉన్న వరిపంట దెబ్బతినింది. అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో చెక్‌డ్యామ్‌కు ఆనుకుని ఉన్న సైడ్‌వాల్ కో తకు గురై వరదనీరు పంటలను ముంచెత్తింది. కౌ కుంట్ల మండలంలో పెద్దఎత్తున పత్తి పంట దెబ్బతి నింది. నీట మునిగిన పత్తిపంట ఎరుపెక్కి పూర్తిగా పాడైపోయింది. గండీడ్, హన్వాడ, బాలానగర్ మండ లాల్లో పెద్దగా పంట నష్టం జరగలేదని తెలుస్తోంది. బాలానగర్ మండలంలోని పలు గ్రామాల్లో వేసిన రే గడి పొలాల్లో పత్తి దెబ్బతిన్నా అధికార యంత్రాంగం ఆ వివరాలు పేర్కొనలేదని తెలుస్తోంది.
675 ఎకరాల్లో పంటల నష్టం
అధికారులు చేసిన లెక్కల ప్రకారం జిల్లాలో 675 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు ప్రాఽథమిక నివేది క తయారుచేసి ఉన్నతాధికారులకు సమర్పించారు. అయితే నష్టం వెయ్యి ఎకరాలకుపైనే జరిగినట్లు తె లుస్తోంది. ఇందులో 528 ఎకరాల్లో వరి, 140 ఎకరా ల్లో పత్తి, 5 ఎకరాల్లో మొక్కజొన్న , 2 ఎకరాల్లో జొ న్న పంటలు దెబ్బతిన్నట్లు నివేదిక ఇచ్చారు. జిల్లా లోని మొత్తం 37 గ్రామాలకు చెందిన 460 మంది రైతులకు నష్టం వాటిల్లింది. ఇందులో కౌకుంట్ల, భూ త్పూర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ అర్బన్ మండలా ల్లో ఎక్కువ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. రా
నష్టపోయిన పంటలు
అధికారుల లెక్కల ప్రకారం 37 గ్రామాల్లో 675 ఎకరాల్లో పంటలు న ష్టపోయినట్లు తెలుస్తోంది. ఇందులో సీసీకుంట మండలంలో 20 ఎకరాల్లో వరి, 2 ఎకరాల్లో పత్తి, భూత్పూర్ మండలంలో 109 ఎకరాల్లో వరి, మహ మ్మదాబాద్ మండలంలో 20 ఎకరాల్లో వరి, మహ బూబ్‌నగర్ మండలంలో 120 ఎకరాల్లో వరి, మిడ్జిల్‌లో 25 ఎకరాల్లో వరి, జడ్చర్లలో 64 ఎకరాల్లో వరి, 5 ఎకరా ల్లో మొక్కజొన్న, 8 ఎకరాల్లో పత్తి, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 130 ఎకరాల్లో వరి, అడ్డాకులలో 10 ఎకరరాల్లో పత్తి పంట నష్టపోయింది. ల్లో పంటల నష్టం