వరద ప్రవాహం
ABN , Publish Date - May 31 , 2025 | 10:59 PM
శ్రీశైలం ప్రాజెక్టుకు రోజురోజుకు కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్ ఉత్పాదనతో 26,817 స్యూసెక్కుల నీరు విడు దల చేస్తున్నారు.
- శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వస్తున్న నీరు
- కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- డ్యాంలోకి చేరుతున్న 36 వేలకుపైగా క్యూసెక్కుల నీరు
- వారం రోజుల్లో శ్రీశైలం డ్యాంకు చేరిన 10 టీఎంసీల వరద
దోమలపెంట/ఆత్మకూరు/రాజోలి, మే 31 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టుకు రోజురోజుకు కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్ ఉత్పాదనతో 26,817 స్యూసెక్కుల నీరు విడు దల చేస్తున్నారు. మొత్తంగా 31,162 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాం వైపునకు వస్తుండగా, 36,740 క్యూసె క్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నది. ఎంజీకేఎల్‌ఐ కాల్వ ద్వారా 416 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. దీంతో శనివారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను, 828.20 అడుగుల కు చేరింది. 215.807 టీఎంసీల సామర్థ్యానికి గాను 47.7648 టీఎంసీల నీటి నిల్వలు నమోదు అవుతున్న ట్లు డ్యాం గేజింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఎడ మ గట్టు విద్యుత్ కేంద్రంలో 1,095 క్యూసెక్కుల నీటితో 0.484 మిలియన్ యూనిట్లు, కుడి గట్టు కేంద్రంలో 638 క్యూసెక్కులు నీటిని వినియో గించి 0.291 మిలియన్ యూ నిట్ల విద్యుత్‌ను ఉత్పాదన చే స్తున్నారు. శ్రీశైలం డ్యాం నిల్వ నీటి నుంచి 2,310 స్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో కొనసాగుతున్న దని శనివారం డ్యాం అధికారులు తెలిపారు.
కొన సాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి
ఎగువ నుంచి వరద కొనసాగుతున్న కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ దిగువ జల వి ద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగి స్తున్నట్లు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. శనివారం సాయంత్రం నాటికి ఎగు వ జూరాలలో నాలుగు యూనిట్ల ద్వారా 2.338 మిలి యన్ యూనిట్ల ఉత్పత్తి కొనసాగించినట్లు తెలిపారు. అలాగే దిగువ జూరాల జల విద్యుత్ ఉత ్పత్తి కేంద్రం లో మూడు యూనిట్లు ప్రారంభించి 2.284 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి రాబట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ముందుగానే వరద వచ్చిన కారణ ంగా ముందుగానే ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపారు.
సుంకేసులకు..
రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. శనివారం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 4,500 క్యూసెక్కులు వరద నీరు వస్తుండటంతో ఒక గేటు ద్వారా 4,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు సుంకేసుల ప్రాజెక్టు జేఈ రాజు తెలిపారు. సుంకేసుల డ్యాం నీటి సామర్థ్యం 292.00 కాగా, ప్రస్తుతం 291.60 మీటర్లుగా నమోదైంది. నీటి నిల్వ 1.20 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.068 టీఎంసీ నీరు ఉందని అధికారులు తెలిపారు.