చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:14 PM
చి న్నంబావి మండల పరిధిలోని వీపనగండ్ల గ్రా మానికి చెందిన తెలుగు కొట్టం పెద్ద మౌలాలి (59) చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు.
చిన్నంబావి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): చి న్నంబావి మండల పరిధిలోని వీపనగండ్ల గ్రా మానికి చెందిన తెలుగు కొట్టం పెద్ద మౌలాలి (59) చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామ స్థుల కథనం ప్రకారం.. మౌలాలి చేపల వల తీ సుకుని గ్రామ సమీపంలోని పొలం దగ్గరికి శుక్ర వారం మనుమడు కుమార్‌తో కలిసి వెళ్లాడు వ రి పంటను పరిశీలించారు. ఆకలి అవుతుందని మనుమడు ఇంటికి బయలుదేరగా, మౌలాలి ప క్కనే ఉన్న భీమా కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కాల్వ దగ్గరకు వెళ్లి చూడగా బీడీ కట్ట, అగ్గిపెట్టె, ఆ ప క్కనే బట్టలు కనిపించాయి. చుట్టుపక్కల కాల్వలో వెతికారు. చీకటి పడటంతో ఇంటికి వచ్చారు. ఉదయాన కొంత దూరంలో చేపల వలలో ఇరుక్కున్న మృత దేహం కనిపించింది. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ వెంకట్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చునని తెలిపారు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్‌ఐ రాణి తెలిపారు.
రంగసముద్రం రిజర్వాయర్‌లో..
శ్రీరంగాపురం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): శ్రీ రంగాపురం మండల కేంద్రానికి చెందిన ఆంజనే యులు (35) రంగ సముద్రం రిజర్వాయర్‌లో చే పల వేటకు వెళ్లి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ హిమబిందు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంజనే యులు శనివారం తెల్లవారుజామున రంగసము ద్రం రిజర్వాయర్ గేట్ల ముందు ఉన్న పెద్ద గుం తలో వలను తీయడానికి పోయి అక్కడే మునిగి పోయాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న వ్యక్తి గమనించి కుటుంబ సభ్యులకు చెప్పాడు. గ్రామస్థులతో కలిసి వచ్చిన వారు గుంతలో గాలించగా మృతదేహం బయటపడింది. వెంటనే ఎస్‌ఐకు సమాచా రం ఇవ్వగా సంఘటన స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించారు. పోస్టుమా ర్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.