జములమ్మ రిజర్వాయర్‌లో చేపపిల్లలు విడుదల
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:31 PM
మత్స్యకారుల సంక్షేమం ఆర్ధికాభివృద్ధి కోసం ప్రభు త్వం అందిస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీని శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని జముల మ్మ రిజర్వాయర్‌లో నిర్వహించారు.
గద్వాల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) మత్స్యకారుల సంక్షేమం ఆర్ధికాభివృద్ధి కోసం ప్రభు త్వం అందిస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీని శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని జముల మ్మ రిజర్వాయర్‌లో నిర్వహించారు. జిల్లా మ త్స్యశాఖ అధికారి షకీలా బాను మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు వెంకట్రాములు, నాయకులు శ్రీనుముదిరాజ్ తెలుగు లక్ష్మన్, తె లుగు దౌలన్న, నెమలికంటి రామాంజనేయులు సమక్షంలో చేపపిల్లలను వదిలారు. ఈ ఏడాది ఆలస్యం అయినప్పటికీ నాణ్యత గల చేపపిల్లల ను అందిస్తున్నామని వివరించారు. చేపపిల్లల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులకు జిల్లా అధికారి సూచించారు.